Hyderabad, ఫిబ్రవరి 26 -- Shreya Ghoshal: ఐటెమ్ సాంగ్స్ ఏవైనా ఆడవాళ్లను కాస్త ఇబ్బంది పెట్టేవే. ఆ పాటల్లోని లిరిక్స్, వాటిపై హీరోయిన్స్ వేసే స్టెప్పులు దారుణంగా ఉంటాయి. అలాంటి ఓ పాట పాడిన ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్.. ఇప్పుడు తనకు చాలా సిగ్గుగా అనిపిస్తోందని అనడం విశేషం. దాని అర్థం ఏంటో తెలియకుండా పిల్లలు పాడుతుండటం సరికాదని ఆమె అంటోంది.

శ్రేయా ఘోషాల్ గతంలో బాలీవుడ్ లో వచ్చిన అగ్నిపథ్ మూవీలోని చికినీ చమేలీ అనే పాట పాడింది. ఈ ఐటెమ్ సాంగ్ పై కత్రినా కైఫ్ వేసిన స్టెప్పులు ఇప్పటికే పాపులరే. దీనిపై తాజాగా లిలీ సింగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయా స్పందించింది. తాను ఇలాంటి అసభ్యకరమైన పాటను కొన్ని పాడినట్లు ఆమె చెప్పింది.

"సెన్సువల్, సెక్సీగా ఉండటానికి, పూర్తి అభ్యంతకరంగా ఉండటం మధ్య ఓ చిన్న రేఖ ఉంటుంది. ఈ విషయం నేను కాలం గడుస్తున్న కొద్దీ తెలుసు...