భారతదేశం, ఏప్రిల్ 9 -- అమెరికాలో కాల్పుల సంఘటనలు ఆగిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇప్పుడు వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలో సామూహిక కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మరణించారు. ఈ కాల్పుల్లో చాలా మంది గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వర్జీనియాలోని స్పాట్సిల్వేనియా కౌంటీలోని టౌన్‌హౌస్ క్యాంపస్ వెలుపల కాల్పుల సంఘటన జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో(స్థానిక సమయం) ఓల్డ్ గ్రీన్విచ్ సర్కిల్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం రాజధాని వాషింగ్టన్ డిసికి నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో ఉంది. స్పాట్సిల్వేనియా షెరీఫ్ కార్యాలయం మాట్లాడుతూ, కౌంటీలోని టౌన్ హౌస్ క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయని 911కు కాల్ వచ్చిందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాన్...