భారతదేశం, ఫిబ్రవరి 11 -- జర్మనీలోని వీసెన్ హాస్ లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ తొలి ఈవెంట్లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ కు షాక్. ఈ చెన్నై ఆటగాడు క్వార్టర్స్ లో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఒక్క విక్టరీ లేకుండానే నిష్క్రమించాడు. గతేడాది చివర్లో చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర నమోదు చేసిన గుకేశ్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించనిదే.

క్వార్టర్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానాతో తొలి గేమ్ లో ఓడిపోయిన గుకేశ్ కు రెండో రౌండ్లో డూ ఆర్ డై పరిస్థితి తలెత్తింది. రేసులో నిలవాలంటే కచ్చితంగా విక్టరీ సాధించాల్సి వచ్చింది. కానీ కరువానా దూకుడు ముందు గుకేశ్ తేలిపోయాడు. కేవలం 18 ఎత్తుల్లోనే ఓటమి అంగీకరించాడు. బ్లాక్ పీస్ లతో ఆడిన గుకేశ్ ఏమంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు.

ఈ టోర్నీలో ఒక్క విక్టరీ లేకుండానే గుకేశ్ నిష్క్రమించాడు. అం...