భారతదేశం, ఫిబ్రవరి 21 -- మాజీ నంబర్ వన్, నాలుగు గ్రాండ్ స్లామ్స్ విన్నర్ కార్లోస్ అల్కరాస్ కు షాక్. అనామకుడి చేతిలో ఈ స్పెయిన్ ఆటగాడు పరాజయం పాయ్యాడు. అల్కరాస్ కు చెక్ రిపబ్లిక్ కు చెందిన జిరి లెహెకా షాకిచ్చాడు. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో లెహెకా 6-3, 3-6, 6-4 తేడాతో టాప్ సీడ్ అల్కరాస్ ను ఓడించాడు. రెండున్నర గంటల్లో అల్కరాస్ పై విజయం సాధించాడు.

ఖతార్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో అల్కరాస్ ఫేవరెట్ గా బరిలో దిగాడు. ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న అల్కరాస్ ఈ టోర్నీలో టైటిల్ గెలుస్తాడనిపించింది. కానీ క్వార్టర్స్ లో జిరి లెహెకా అమేజింగ్ ఆటతీరుతో అదరగొట్టాడు. ప్రస్తుతం 24వ ర్యాంక్ లో ఉన్న లెహెకా గొప్పగా ఆడాడు. తొలి సెట్లో గెలిచాడు. రెండో సెట్లో ఓడిపోయినా.. తిరిగి పుంజుకుని మూడో సెట్లో అల్కరాస్ ను చిత్తు చేశాడు.

జిర...