Hyderabad, ఫిబ్రవరి 22 -- భారతదేశ సంప్రదాయాల్లో పండుగలు, పూజలతో పాటు ఉపవాసాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నిర్వహించే ఉపవాసాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. హిందూ మతంలో ఉపవాసం అనేది ధర్మం, విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. కానీ, ఉపవాసం ఉండటం వల్ల కేవలం ఆధ్మాత్మికంగానే కాదట, అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయట! మరి కొద్ది రోజుల్లో ఆ మహదేవుని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్న పర్వదినం మహాశివరాత్రి. ఈ రోజున ఉపవాసం ఉండి తమలోని ఆధ్మాత్మికతనే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోనున్నారు.

ధార్మిక నమ్మకాల ప్రకారం, శివరాత్రి పర్వదినాన పార్వతీ దేవీకి, శంకరుని వివాహం జరిగింది. మీరు కూడా ఈ రోజు ఉపవాసం చేయాలని అనుకుంటే, ఉపవాసంతో కలిగే ఆరోగ్యానికి ప్రయోజనాలను తెలుసుకోండి.

ఉపవాసం చేయడం వల్ల జీవక్రియ వేగం తగ్గుతుంది. దీనివల్ల శరీరం తనంతట తా...