భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఈ రోజే మహాశివరాత్రి. శివరాత్రిని అడుగు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడు బ్రహ్మరూపం నుంచి లింగరూపంలోకి అవతరించిన ఈ రోజునే శివరాత్రి అంటారు. శివ పురాణం ప్రకారం చూసినట్లయితే, శివుడు పార్వతీదేవితో వివాహం జరిగిన రోజు కూడా ఈ విశేష రోజునే.

ఈ ఏడాది ఫిబ్రవరి 15, అనగా ఈరోజు, శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజు పరమేశ్వరుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. అలాగే శివార్చన, శివాభిషేకంతో కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి విశిష్టత ఉంది. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం.

శివుడికి అన్నాభిషేకం చేయడం వలన సుఖ జీవనం పొందవచ్చు.

ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది.

నారికేళ జలంతో అభిషేకం చేయడం వలన సర్వసంపద వృద...