Hyderabad, ఫిబ్రవరి 24 -- మహాశివరాత్రి హిందువుల ముఖ్యమైన పండగల్లో ఒకటి. శివుని ఆరాధన మానసిక ప్రశాంతతను ఇస్తుందని అంటారు. శివుడిని పూజించేందుకు భక్తులు ప్రతినెలా మాస శివరాత్రిని నిర్వహించుకుంటారు. కానీ ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి మాత్రం అత్యంత ముఖ్యమైనది.

ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్ధ తిధి నాడు మహాశివరాత్రి నిర్వహించుకుంటారు. ఈ శివరాత్రినాడే శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని చెప్పుకుంటారు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివుడిని పార్వతిని పూజిస్తారు. అలాగే శివ పూజలో శివునికి ఇష్టమైన ప్రసాదాలను పెడతారు. శివునికి ఏ ప్రసాదాలంటే ఇష్టమో తెలుసుకోండి.

మహాశివరాత్రి ఉపవాసం ఫిబ్రవరి 26వ తేదీ రాత్రికి పాటిస్తారు. ఆరోజు పూజ చేసేటప్పుడు శివునికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించాలి. మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించాక కూడా పూజ చేస్తారు. అప్పుడు కూడా...