Hyderabad, ఏప్రిల్ 17 -- Shiva Rajkumar About His Cancer And Ram Charan Character: కన్నడ నాట సూపర్ స్టార్‌గా ఎదిగారు శివరాజ్ కుమార్. రజనీకాంత్ జైలర్ సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే, శివరాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 45.

కన్నడ నాట పాపులర్ హీరోలు అయిన శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నటుడు రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన సినిమానే 45. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంగీత దర్శకుడు అర్జున్ జన్యా డైరెక్టర్‌గా మారారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 45 మూవీ టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా 45 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తనకు వచ్చిన క్యాన్సర్‌ గురించి చ...