Hyderabad, ఫిబ్రవరి 20 -- శివరాత్రి వచ్చేస్తుంది. ధార్మిక నమ్మకాల ప్రకారం శివరాత్రి రోజునే భోళాశంకరుడు, పార్వతిదేవిల వివాహం జరిగింది. ఈ రోజున ఈ ఆదిదంపతులను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో సంతోషం, ప్రేమ కలుగుతాయని నమ్ముతారు. ఇందుకోసం ఉపవాసాలు కూడా చేస్తుంటారు. శివపార్వతులను దాంపత్య జీవితంలో ప్రేమ, గౌరవం, నమ్మకం వంటి వాటికి చిహ్నంగా కూడా చెబుతుంటారు.

ఇలాంటి ఆది దంపతుల్లా మీకు కూడా ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలనుకుంటున్నారా? పరస్పరం ప్రేమ, మాధుర్యంతో మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా మలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు శివ పార్వతులను కేవలం పూజించడం మాత్రమే కాదు.. ఆ జంట నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని పాటించారంటే మీరు ఆదర్శ దంపతులుగా మారతారు. శివుడు, పార్వతి మాతల దాంపత్య జీవితం నుంచి మీకు నేర్చుకోవాల్సిన విషయాలేంటో...