భారతదేశం, జనవరి 14 -- ప్రతీ ఏటా పుష్య మాసంలో ఏకాదశిని షట్తిల ఏకాదశిగా జరుపుకుంటాము. ఈసారి భోగి నాడు షట్తిల ఏకాదశి రావడం విశేషం. షట్తిల ఏకాదశి రోజున అన్నం తినడం నిషేధించబడింది. భోగి పండుగ ఈ నెల 14వ తేదీన అంటే ఈరోజు వచ్చింది. సంక్రాంతి నాడు మధ్యాహ్నం జనవరి 15 వరకు ఏకాదశి తిధి ఉంటుంది. షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిది. లేదా సాత్విక ఆహారాన్ని తీసుకోండి.

ఏకాదశి తేదీ: జనవరి 14, 2026

ఏకాదశి తిథి ప్రారంభం: జనవరి 13, 2026, మధ్యాహ్నం 3:17

ఏకాదశి తిథి ముగింపు: జనవరి 14, 2026, సాయంత్రం 5:52

జనవరి 15, 2026, ఉదయం 7:15 నుంచి ఉదయం 9:21 లోగా ఉపవాసాన్ని విరమించవచ్చు

ద్వాదశి ముగింపు: జనవరి 15, 2026, సాయంత్రం 8:16

ఈ రోజున నువ్వులతో తయారైన వస్తువులను దానం చేయాలి. ఇది కాకుండా నల్ల నువ్వులు, బెల్లం, బట్టలు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు మొదలైన వ...