భారతదేశం, మార్చి 25 -- రూపేశ్, ఆకాంక్ష హీరోహీరోయిన్లుగా షష్టిపూర్తి చిత్రం వస్తోంది. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అర్చన కూడా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. లేడీస్ టైలర్ తర్వాత 30 ఏళ్ల అనంతరం మళ్లీ వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. షష్టిపూర్తి చిత్రం నుంచి నేడు (మార్చి 25) ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.

షష్టిపూర్తి చిత్రం నుంచి 'ఏదో.. ఏ జన్మలోదో' అంటూ తొలిపాట నేడు రిలీజ్ అయింది. ఈ పాటకు మెలోడిస్ ట్యూన్ ఇచ్చారు ఇళయరాజా. లవ్ డ్యుయెట్ పాటగా వచ్చింది. ఈ సాంగ్‍కు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి లిరిక్స్ ...