Hyderabad, ఏప్రిల్ 16 -- Sharwanand About Tamanna In Odela 2 Pre Release Event: మిల్కీ బ్యూటి తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ ఓదెల 2. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఓదెల 2కి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్ అందించారు.

ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా ఓదెల 2 రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ హీరో శర్వానంద్ హాజరయ్యాడు. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ తమన్నాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు శర్వానంద్.

హీరో శర్వా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. కొన్ని కొన్ని సినిమాలు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మంచి వాటంత అదే జరిగిపోతుంది. ఓదెల 2 టీజర్ చూడగానే అరుంధతి, అమ్మోరు సినిమాలు చూసిన ఫీలింగ...