భారతదేశం, ఏప్రిల్ 16 -- Share trading scam: నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.45.69 లక్షలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్ లో షేర్స్ ట్రేడింగ్ (Share trading scam) ద్వారా అధిక లాభాలు తెప్పిస్తామని అతడికి సైబర్ నేరగాళ్లు ఆశపెట్టారు.

ఈ సైబర్ నేరగాళ్లు ముందుగా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ర్యాండమ్ గా అందరికీ స్టాక్ మార్కెట్ లో షేర్స్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు తెప్పిస్తామని మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఎవరైనా ఆ సందేశాలకు స్పందించి రిప్లై ఇస్తే చాలు. వారిని అధిక లాభాల ఆశ చూపుతారు. షేర్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెట్టి, మంచి రాబడి ఇస్తామని హామీ ఇస్తారు. అలాగే, ముంబైకి చెందిన ఈ బాధితుడిని కూడా వారు సంప్రదించారు. వారిని నమ్మి ఆ 44 ఏళ్ల వ్యక్తి రూ. 45.69 లక్షలు వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ...