భారతదేశం, మార్చి 29 -- ఇండియన్ టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఆచంట శరత్ కమల్ కెరీర్ ముగిసింది. ఈ దిగ్గజం చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో అతను నిష్క్రమించాడు. చెన్నైలో శనివారం (మార్చి 29) డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీ ప్రిక్వార్టర్స్ లో శరత్ ఓడాడు. తెలుగు కుర్రాడు ఆర్ఎస్ స్నేహిత్.. వెటరన్ శరత్ కమల్ ను ఓడించాడు.

భారత టీటీ దిగ్గజం శరత్ కమల్ తన చివరి మ్యాచ్ లో వరుస గేమ్‌ల్లో చిత్తయ్యాడు. 24 ఏళ్ల హైదరాబాదీ ఆటగాడు స్నేహిత్ కు 42 ఏళ్ల శరత్ పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి గేమ్ 9-9తో ఈక్వల్ గా నిలిచిన సమయంలో శరత్ బాల్ ను నెట్ కు కొట్టాడు. ఈ గేమ్ ను స్నేహిత్ 11-9తో గెలుచుకున్నాడు. రెండో గేమ్ లో శరత్ 8-11తో ఓడిపోయాడు. మూడో గేమ్ లో 11-9తో నెగ్గిన స్నేహిత్ క్వార్టర్స్ చేరుకున్నాడు.

భారత్ లో టేబుల్ టెన్నిస్ కు పర్యాయ పదంగా మారిన దిగ్గజం శరత్ కమల్ మార్చి 5నే రిటై...