భారతదేశం, మార్చి 5 -- భారత్ లో టేబుల్ టెన్నిస్ కు పర్యాయ పదంగా మారిన దిగ్గజం శరత్ కమల్ ఆటకు వీడ్కోలు పలికాడు. టీటీ కెరీర్ కు ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నీ తో ఆటకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ కు శరత్ ఎండ్ కార్డు వేయబోతున్నాడు.

తన కెరీర్ లో చివరి టోర్నీని శరత్ కమల్ చెన్నైలో ఆడబోతున్నాడు. అతను ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీని కూడా చెన్నైలోనే ఆడాడు. ''చెన్నైలో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ ఆడా. ఇప్పుడు చెన్నైలోనే చివరి అంతర్జాతీయ టోర్నీ ఆడబోతున్నా. ప్రొఫెషనల్ అథ్లెట్ గా ఇదే నా చివరి టోర్నీ'' అని డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీ ప్రెస్ మీట్ లో 42 ఏళ్ల శరత్ ప్రకటించాడు.

శరత్ కమల్ తెలుగు కుటుంబానికి చెందిన ఆట...