భారతదేశం, మార్చి 21 -- ఆది సాయికుమార్‌, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన మూవీ ష‌ణ్ముఖ‌. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ఆదిత్యం ఓం, అరియానా గ్లోరీ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

సిటీలో అమ్మాయిలు వ‌రుస‌గా మిస్స‌వుతుంటారు. ఆ త‌ర్వాత నెల‌లోపే వారి బాయ్‌ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకుంటుంటారు. ఈ మిస్ట‌రీపై రీసెర్చ్ చేస్తుంటుంది క్రిమినాల‌జీ స్కాల‌ర్ సారా (అవికాగోర్‌). ఈ అన్వేష‌ణ‌లో మాజీ బాయ్‌ఫ్రెండ్ పోలీస్ ఆఫీస‌ర్‌ కార్తీ(ఆది సాయికుమార్) సాయం కోరుతుంది.

తొలుత సారా మాట‌లు అబ‌ద్ధ‌మ‌ని కొట్టిప‌డేసిన కార్తీ సాయం చేయ‌డానికి ఒప్పుకోడు. ఆ త‌ర్వాత ఆమె మాట‌లు నిజ‌మ‌ని తెలుసుకొని కార్తీ మిస్సింగ్‌ల‌పై ఇన్వేస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తాడు. మ‌రోవైపు ఓ మార...