భారతదేశం, ఫిబ్రవరి 23 -- Shanmukh Jaswanth Received Bail: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురువారం (ఫిబ్రవరి 22) తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. తన సోదరుడిని ఓ యువతి ప్రేమ విషయంలో విచారించడానికి వెళ్లిన నార్సింగి పోలీసులకు గంజాయితో షణ్ముఖ్ దొరికాడు. దాంతో షణ్ముఖ్‌ను, అతని సోదరుడు సంపత్ వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం వచ్చింది.

ఇప్పుడు తాజాగా బెయిల్‌పై షణ్ముఖ్ జశ్వంత్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఆ ఫొటోలో కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. అతని సోదరుడు సంపత్ వినయ్ కనిపించలేదు. దీంతో అతనికి బెయిల్ వచ్చిందా లేదా అనేది స్పష్టత రాలేదు. అయ...