Hyderabad, మార్చి 28 -- Shampooing: ప్రతిరోజూ షాంపూ చేయాలా? లేక వారానికి ఒకసారి చేస్తే సరిపోతుందా? అనేది జుట్టు శైలిని బట్టి నిర్ణయించాలి. జుట్టు రకం, తలపై ఉండే మాడు కండిషన్, వారి లైఫ్ స్టైల్... వీటన్నిటి ఆధారంగా నిర్ణయించుకోవాలి. కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. అలాగే కొంతమంది కాలుష్యంలో ప్రతిరోజూ పనిచేయాల్సి వస్తుంది. అలాంటివారు ప్రతిరోజూ షాంపూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజూ షాంపు చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుందన్నది నిజం. అంతేగా జుట్టు రిఫ్రెష్ గా కూడా ఉంటుంది. కాలుష్యం, ధూళి, చెమట వీటన్నింటినీ ప్రతిరోజూ తలకు స్నానం చేయడం వల్ల తొలగించుకోవచ్చు.

ప్రతిరోజు విపరీతంగా శారీరక శ్రమ చేసేవారు, వేడి వాతావరణంలో పని చేసేవారు, తల పరిశుభ్రంగా ఉండాలని అనుకునేవారు, చుండ్రుతో బాధపడేవారు, దురదలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు షాంపూ చేయడం చాలా ముఖ్యం.

అ...