Hyderabad, ఏప్రిల్ 1 -- Shalini Pandey: షాలిని పాండే తెలుసు కదా. విజయ్ దేవరకొండతో కలిసి అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి. ఈ మధ్యే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ తోనే పేరు సంపాదించింది. ఇప్పుడామె కెరీర్ తొలినాళ్లలో ఓ సౌత్ డైరెక్టర్ తో ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది.

షాలిని పాండే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. "నా కెరీర్లో అందరూ మంచివాళ్లతోనే పని చేశానని నేను చెప్పలేను. చాలా చెడ్డవాళ్లతోనూ పని చేయాల్సి వచ్చింది.

అందులో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, సిబ్బందిలో భాగమైన వాళ్లు కూడా ఉన్నారు. మీకు మీరుగా ఇండస్ట్రీలో పరిమితులు విధించుకోవాలి. తప్పుడు ఉద్దేశాలతో ఉన్న ఎంతో మంది వ్యక్తులను నేను చూశాను. ఇది కూడా నిజం" అని షాలిని వెల్లడించింది. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చినదాన్ని కాకపోవడంతో మొద...