Hyderabad, ఏప్రిల్ 29 -- Shaitaan OTT Release: అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ముగ్గురు కలిసి నటించిన సూపర్ నేచురల్ హారర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రదర్శన కనబరిచి భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో వచ్చిన గుజరాతీ హర్రర్ చిత్రం 'వాష్'కి రీమేక్.

పేరుకు రీమేక్ అయినప్పిటికీ నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా పూర్తి హారర్ అంశాలతో సైతాన్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రూ. 60 నుంచి 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 211.06 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

అంతేకాకుండా సినిమా విడుదలైన తొలి పది రోజుల్లోనే ...