Hyderabad, మార్చి 18 -- Shaitaan 10 days box office collection: బాలీవుడ్‌లో ఈ మధ్యే వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. వికాస్ బహల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక నటించారు. ఇప్పుడీ సినిమా తొలి పది రోజుల్లోనే ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. తొలి రోజు తొలి షో నుంచే మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సైతాన్ దూసుకెళ్తోంది.

సైతాన్ మూవీ సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు బాక్సాఫీస్ ట్రెండ్స్ ను ట్రాక్ చేసే Sacnilk.com వెల్లడించింది. రెండో ఆదివారం కూడా సైతాన్ మూవీ ఇంకా బలంగా ఉండటం విశేషం. ఆదివారం (మార్చి 17) ఈ సినిమా రూ.9.75 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ సైతాన్ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి.

9వ రోజు వరకూ ఇండియాలో ...