Hyderabad, మార్చి 17 -- Shah Rukh Khan House: ముంబైలోని టూరిస్ట్ ఆకర్షిత ప్రదేశాల్లో ఒకటి మన్నత్ (Mannat). ఇది బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సొంతిల్లు. ప్రతి రోజూ కొన్ని వందల మంది అభిమానులు ఆ ఇంటి దగ్గర తమ హీరో కోసం ఎదురు చూస్తుంటారు. సెల్ఫీలు దిగుతుంటారు. అలాంటి ఇంటిని ఇప్పుడు కింగ్ ఖాన్ వదలనున్నాడు. కొన్ని నెలల అతడు ఓ అద్దె ఇంట్లో ఉండనుండటం విశేషం.
షారుక్ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న మన్నత్ లో 25 ఏళ్లుగా ఉంటున్నాడు. ఇప్పుడీ ఇంటిని పూర్తిగా ఆధునీకరించబోతున్నారు. ఈ ఏడాది మే నెలలో మన్నత్ రెనొవేషన్ పనులు ప్రారంభం కానున్నట్లు షారుక్ సన్నిహిత వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు వెల్లడించాయి.
నిజానికి మన్నత్ గ్రేడ్ 3 హెరిటేజ్ నిర్మాణం. ఇలాంటి వాటి నిర్మాణంలో మార్పుల కోసం కోర్టు అనుమతి అవసరం.ఇప్పటికే షారుక్ ఖాన్ ఆ అనుమతి కూడా తీసుకున్నాడు. మన్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.