భారతదేశం, ఏప్రిల్ 4 -- ఒక సెక్స్​ వర్కర్​కి సంబంధించిన కథ ఇప్పుడు సోషల్​ మీడియాలో నెటిజన్ల హృదయాలను కదలిస్తోంది. సొంత మామ, ఆ మహిళను అమ్మేశాడు! ఆమె 15ఏళ్ల పాటు ఇంటికి దూరమైంది. ఇప్పుడు ఇంటికి వెళ్లే ఛాన్స్​ వచ్చింది. కానీ ఆమెను సొంత కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు!

అనీష్​ భగత్​ అనే కంటెంట్​ క్రియేటర్​ ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన ఓ వీడియోతో ఆ మహిళ కథ బయటకు వచ్చింది. ఆ వీడియో వైరల్​గా మారి, ఇప్పటికే 6.7 మిలియన్​కిపైగా మంది వీక్షించారు. వీడియోలో మహిళ తన చిన్నతనం గురించి వివరించింది. తన సొంత మామ తనని 16ఏళ్ల వయస్సులో 'సెక్స్​ ట్రేడ్​'లో విక్రయించినట్టు వెల్లడించింది. ఆ తర్వాత చాలా కష్టాలు పడినట్టు పేర్కొంది.

15ఏళ్ల తర్వాత ఆ మహిళ, తన ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తోటి సెక్స్​ వర్కర్లు ఆమె వద్దకు వెళ్ల...