భారతదేశం, మార్చి 25 -- Serial: ఓ సీరియ‌ల్‌లో మ‌రో సీరియ‌ల్ యాక్ట‌ర్స్ గెస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించి ఆడియెన్స్‌ను అడ‌పాద‌డ‌పా స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. గెస్ట్ క్యారెక్ట‌ర్స్ ట్రెండ్ గ‌త కొన్నాళ్లుగా తెలుగు సీరియ‌ల్స్‌లో ఎక్కువైంది. సీరియ‌ల్ యాక్ట‌ర్స్ మాత్ర‌మే కాకుండా సినిమా, సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీలు సైతం సీరియ‌ల్స్‌లో త‌ళుక్కున మెరుస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నారు.

తాజాగా స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఇంటింటి రామాయ‌ణం సీరియ‌ల్‌లో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు టీమ్ సంద‌డి చేయ‌నుంది. మంగ‌ళ‌వారం నాటి ఇంటింటి రామాయ‌ణం ప్రోమో ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ యాక్ట‌ర్స్ క‌నిపించారు. ప్ర‌భాక‌ర్‌, అమ‌నితో పాటు దుర్గాదేవిని ప్రోమోలో చూపించారు. అస‌లు పేర్ల‌తో కాకుండా ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లోని పేర్ల‌తోనే ఇంటింటి రామాయ‌ణంలో వీరు క‌నిపించ‌నున్...