భారతదేశం, ఆగస్టు 30 -- సెప్టెంబర్ నెల మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన బ్యాంకు సెలవుల క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 2025లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు 15 రోజుల వరకు సెలవులు ఉన్నాయి!

అయితే, అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులు 15 రోజులు మూసి ఉంటాయని దీని అర్థం కాదు- ఎందుకంటే బ్యాంకు సెలవులు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి.

సెప్టెంబర్‌లో ఓనం, దుర్గా పూజ వంటి పండుగలకు సెలవులు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం, అలాగే నెలలోని రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి అన్ని బ్యాంకులు ఆయా రాష...