Hyderabad, మార్చి 3 -- ఎదుటివారి వల్లే కాదు మీ వల్ల కూడా మీకు సమస్యలు వస్తాయి. కానీ మీ వల్లే ఆ సమస్య వచ్చిందని అర్థం చేసుకోకుండా... ఎదుటివారిపైన నిందలు వేస్తారు. ఇది ఎంతో హానికరం. మీ సొంత ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తనా కూడా మీ పురోగతిని అడ్డుకుంటాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు మీకు మీరే శత్రువు అని చెప్పుకోవాలి. వేరే ఎవరి పేరు చెప్పకూడదు. మీలో కొన్ని రకాల లక్షణాలు ఉంటే వాటిని వెంటనే వదిలేయడానికి ప్రయత్నించండి. లేకుంటే మీ లోపల ఉన్న శత్రువు మరింత బలంగా మారిపోతాడు.

చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. అలాగే మీరు కూడా చేసి ఉంటారు. వాటిని మీకు మీరే తక్కువగా చూసుకుంటే అది నీలో ఉన్న శత్రువు చేస్తున్న పని అనుకోవాలి. తప్పులను ఒప్పుకుంటేనే మీరు ఎదగగలరు

మిమ్మల్ని మీరు కించపరచుకున్నట్టుగా మాట్లాడకూడదు. ఏదైనా వైఫల్యం ఎ...