Hyderabad, మార్చి 27 -- Director Rajkumar About Seethannapeta Gate Movie: వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "సీతన్నపేట గేట్". ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు వై రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో రూపొందిన "సీతన్నపేట గేట్" సినిమా ఏప్రిల్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా సీతన్న పేట గేట్ సినిమా ప్రెస్ మీట్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వై రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ వై రాజ్ కుమార్ మాట్లాడుతూ.. "మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మన సమాజంలో చాలా వరకు మానవ సంబంధాలు ఆర్థిక సంబం...