Hyderabad, మార్చి 4 -- మహిళల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలైన సంతాన సమస్యలు, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం లేదా PCOS, వంధ్యత్వం వంటివి హార్మోన్ల అసమతుల్యత కారణంగా తలెత్తుతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఉత్తమ మార్గం సీడ్ సైక్లింగ్ అని వైద్యులు చెబుతుంటారు. ఇంతకీ సీడ్ సైక్లింట్ అంటే ఏంటి? మహిళలలోని ఈ సమస్యలను నియంత్రించడానికి సీడ్ సైక్లింగ్ ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది వంటి విషయాలను ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు దీక్ష భావసార్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. ఉత్తమ ఫలితాల కోసం సీడ్ సైక్లింగ్‌ను ఎలా అనుసరించాలో కూడా ఆమె వివరించారు.

సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలు వంటి విత్తనాలను ఒక ప్రత్యేకమైన విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. సీడ్ సైక్లింగ్ అనేది పూర్తిగా సున్నితమైన, సహజమైన పద్ధతి. విత్తనాల ప్రత...