సికింద్రాబాద్,హైదరాబాద్, ఏప్రిల్ 5 -- రైల్వే ప్రయాణంలో మరో దారుణం వెలుగు చూసింది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై వాష్ రూమ్ లో తోటి ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందటంతో. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పీటీఐ వివరాల ప్రకారం.. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో ఏప్రిల్ 3 ఉదయం ఈ సంఘటన జరిగింది. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం సికింద్రాబాద్ కు బయల్దేరింది. అర్ధరాత్రి తర్వాత వారి కుమార్తె. వాష్ రూమ్ కు వెళ్లింది. బాలిక వెళ్లటాన్ని గమనించిన ఓ వ్యక్తి..వెనకాలే వెళ్లాడు. బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. అక్కడ జరిగిన ఘటనను తన మొబైల్లో రికార్డు చేశాడు.

అక్కడ్నుంచి తప్పించుకున్న బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాద...