భారతదేశం, జనవరి 25 -- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 26వ తేదీన ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్స్ వెళ్తాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ నెంబర్ 07505) మధ్య జనవరి 26న వన్ వే స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలు తిరుపతి నుంచి రాత్రి 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది రాయలసీమ మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గూటి, గుంతకల్, ఆదోని, రాయచూర్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క...