ఆంధ్రప్రదేశ్,తిరుపతి, డిసెంబర్ 29 -- మహా కుంభమేళకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 12 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. జనవరి 1 నుంచి మార్చి నెల వరకు రాకపోకలు ఉంటాయని పేర్కొంది.

మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో చాలా రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే జనవరిలోనే సంక్రాంతి పండగ ఉంది. దేశవ్యాప్తంగానూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి సెలవులు ఉండటంతో. చాలా మంది సొంత ఊర్లకు ప్రయాణమవుతుంటారు. వీటన్ని...