భారతదేశం, ఫిబ్రవరి 21 -- SCR Maha Kumbh Mela Trains : మ‌హా కుంభ‌మేళాకు వెళ్లే భ‌క్తుల‌కు, యాత్రికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉత్తర‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మహా కుంభమేళాకు 17 స్పెష‌ల్‌ రైళ్లను సౌత్ సెంట్రల్‌ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ రైల్వే స్టేష‌న్ల మీదుగా ఈ మహా కుంభ స్పెషల్ రైళ్లను న‌డ‌ప‌డానికి నిర్ణయించింది.

ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు ప్రయాణికులు, యాత్రికులు, భక్తుల అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్ ఎ.శ్రీధ‌ర్ తెలిపారు.

1. రైలు నెంబ‌ర్ 07021 సికింద్రాబాద్‌-దానాపూర్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 27 తేదీన ఉద‌యం 8.45 గంటలకు స...