తెలంగాణ,హైదరాబాద్, జనవరి 29 -- మహా కుంభమేళాకు వెళ్లే భ‌క్తుల‌కు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. యాత్రికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ రైళ్లను ఆపరేట్ చేయనుంది.ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ధన్ పూర్ కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ ట్రైన్ (నెంబర్ 07079)ఫిబ్రవరి 5వ తేదీన చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ కు చేరుకుంటుంది. ఇక ధన్ పుర్ నుంచి చర్లపల్లి మధ్య మరో సర్వీస్(07080) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఫిబ్రవరి 7వ తేదీన ధన్ పుర్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ క...