Hyderabad, మార్చి 6 -- ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న మహిళలు అధికంగా స్కూటీని వాడుతున్నారు. ఇంటి పనులకు, లేదా ఉద్యోగానికి వెళ్ళడానికి బైక్ వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే గర్భం ధరించిన మహిళలు ఆ సమయంలో స్కూటీని నడపడం సురక్షితమా కాదా అనే ప్రశ్న ఎంతో మందిలో ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భం ధరించాక స్కూటీ నడపవచ్చో లేదో తెలుసుకోండి.

గర్భధారణ సమయంలో స్కూటీ నడపడం చాలా సార్లు ప్రమాదకరం కావచ్చు.

1) గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కీళ్ళు బలహీనపడతాయి. దీని వల్ల నీరసం రావడానికి అవకాశం ఉంటుంది.

2) గర్భం ఆరవ నెల నుండి పిండం పెరుగుతున్న కొద్దీ, పొట్ట పెరుగుతుంది. దీని వల్ల శరీర సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల స్కూటీ నుండి పడిపోయి గాయపడే ప్రమాదం ఉంది. అందుకే ఐదవ లేదా ఆరవ నెల తర్వాత స్కూటీ నడపడం ప్రమాదకరం.

3) గర్భధారణ మొదట...