భారతదేశం, అక్టోబర్ 8 -- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ-అనుబంధ పాఠశాలలకు 10 రోజుల సెలవు ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సామాజిక, విద్యా సర్వే (ప్రజల్లో 'కుల సర్వే'గా సుపరిచితం)లో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఆ పనిని పూర్తి చేసేందుకు వీలుగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు స్కూల్స్​కి సెలవు ఇచ్చారు.

కర్ణాటక కుల సర్వే పని అక్టోబర్ 18 నాటికి, అంటే మరో 10 రోజుల్లో (ఎనిమిది పనిదినాలు) పూర్తి అవుతుందని సిద్ధరామయ్య తెలిపారు. అయితే, మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఈ సర్వే విధుల్లో నుంచి మినహాయింపునిచ్చారు.

వాస్తవానికి ఈ సర్వే పని మంగళవారంతో ముగియాల్సి ఉంది. అయితే, చాలా జిల్లాల్లో పని అనుకున్నంత వేగంగా పూర్తి కాకపోవడంతో, ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరులతో కలిసి సెలవులను మరో 10 రోజులు పొడ...