భారతదేశం, ఫిబ్రవరి 11 -- సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్‌ను అభినందించారు మందకృష్ణ మాదిగ. వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానన్నారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.

రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఉందని.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రక్రియను చేపట్టిన కారణంగా.. ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని వివరించారు సీఎం రేవంత్...