భారతదేశం, మార్చి 18 -- SC Categorization: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్‌ నివేదికకు ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం యూనిట్‌గా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.

తాజా నిర్ణయం ప్రకారం ఏపీలో ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏ క్యాటగిరీలో రెల్లి, ఉపకులాలకు 1%, మాల, ఉపకులాలకు 7.5 శాతం, మాదిగ, ఉపకులాలకు 6.5%. రిజర్వేషన్లకు మంత్రుల సంఘం సిఫారసుల్ని క్యాబినెట్ అమోదం తెలిపింది. క్యాబినెట్‌ నిర్ణయంపై మార్చి 20న అసెంబ్లీలో చర్చించి ఆ తీర్మానాన్నిజాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపుతారు.

ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావించినా 2021 జనాభా లెక్కలు జరగక పోవడంతో 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ చేపడతారు. తాజా అంచనాలు లేకుండా జిల్లా యూనిట్‌ అమలు చేయడంపై అభ్యంతరాల నేప...