భారతదేశం, సెప్టెంబర్ 7 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) ప్రిలిమినరీ పరీక్ష 2025 తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది క్లర్క్ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 6,589 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీలు, కాల్ లెటర్ వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను చూడవచ్చు.

ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్/అడ్మిట్ కార్డ్ త్వరలో విడుదల కానుంది. విడుదలైన వెంటనే, అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్​ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన వారికి జీతం రూ. 24,050 నుంచి రూ. 64,480 మధ్య ఉంటుంది.

ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను సందర్శించండి.

హోమ...