భారతదేశం, ఏప్రిల్ 10 -- భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఏటీఎం లావాదేవీ నియమాలలో మార్పులు తీసుకువచ్చింది. కొత్త నియమాలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అధిక బ్యాలెన్స్ ఉన్నవారు అపరిమిత ఉచిత లావాదేవీలను కూడా పొందుతారు. కొత్త నియమం ఏమిటి? తెలుసుకుందాం..

డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి, ఫీజు నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఎస్బీఐ, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను ప్రభావితం చేస్తుంది. మెట్రో అండ్ నాన్ మెట్రో ప్రాంతాలలో వినియోగ పరిమితులను ప్రామాణీకరించడం టార్గెట్‌గా పెట్టుకుంది.

కొత్త విధానం ప్రకారం, అన్ని మెట్రో లేదా నాన్-మెట్రో కస్టమర్లు ఇప్పుడు ప్రతి నెలా ఎస్బీఐ ఏటీఎం నుండి 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకు ఏటీఎంల నుండ...