భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జన్ నివేశ్ సిప్(SIP) పథకాన్ని ప్రారంభించింది. జన్ నివేశ్ సిప్ స్కీమ్ కింద ఇన్వెస్టర్లు ఒక్కో లావాదేవీకి రూ.250 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్ మాధాబీ పూరీ బుచ్ సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇది ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ యోనోతో పాటు పేటీఎం, గ్రోవ్, జీరోధా వంటి ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

పెట్టుబడిదారులు సాధారణంగా సిప్‌లలో రూ .500 పెడతారు. అయితే కేవలం రూ.250 నుంచి ప్రారంభమయ్యే ఎస్బీఐ సిప్‌లతో తొలిసారి ఇన్వెస్టర్లు, చిన్న పొదుపుదారులు, అసంఘటిత రంగంలోని వారిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నందకిశోర...