భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఒక అమ్మాయి చిన్న వయసులోనే మంచి మొత్తాన్ని ఆదా చేసింది. ఆర్థిక లక్ష్యాలు ఉంటే.. నిరాడంబర జీవితం, అంకితభావం అవసరమని చెబుతుంది. డబ్బు సంపాదించడం కంటే పొదుపు చేయడం చాలా కష్టం. చాలా మందికి మంచి ఆదాయం ఉంటుంది.. కానీ వారి డబ్బును సరిగ్గా మెయింటెన్ చేయలేక, ఆర్థిక క్రమశిక్షణ, వ్యూహం లేక ఇబ్బందుల్లో పడతారు. చిన్నప్పటి నుంచే పొదుపు చేయాలనే ఓ యువతి దృఢ సంకల్పం ఆమెను చాలా డబ్బు సేవింగ్ చేసేలా చేసింది. 24 ఏళ్ల మియా మెక్‌గ్రాత్ అనే అమెరికాకు చెందిన అమ్మాయి రూ. 83 లక్షలు ఆదా చేసింది.

నేటి ప్రపంచంలో కొందరు ఎంత సంపాదించినా తృప్తి పడరు. కొందరు తమ సంపాదనలో సరైన ప్లానింగ్ చేయడం ద్వారా విపరీతంగా పొదుపు చేస్తారు. త్వరగా రిటైర్ అవ్వాలనుకునేవారి పొదుపు బాగుంటుంది. అమెరికాకు చెందిన మియా మెక్ గ్రాత్ అనే మహిళ కూడా అలాంటి బాటలోనే వెళ్తుంది. ...