భారతదేశం, మార్చి 12 -- Save The Tigers 2: ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, చైత‌న్య కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు వెబ్‌సిరీస్ సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 2 మ‌రో మూడు రోజుల్లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మార్చి 15 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ మ‌హి వి రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం క‌థ‌ను అందించారు. తేజ కాకుమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సుజాత‌, దేవ‌యాని, పావ‌ని గంగిరెడ్డి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

మ‌రో మూడు రోజుల్లో సెకండ్ సీజ‌న్ స్ట్రీమింగ్ కాబోతోంది. సెకండ్ పార్ట్ స్టోరీ, క్యారెక్ట‌ర్స్‌తో ఆడియెన్స్ క‌నెక్ట్ కావ‌డానికి మార్చి 1 నుంచి 10 వ‌ర‌కు సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ వ‌న్‌ను ఫ్రీ స్ట్రీమింగ్ ఉంచింది. అస‌లు ఫ‌స్ట్ పార్ట్‌లో ఏం ...