భారతదేశం, నవంబర్ 28 -- Saudi Arabia club offer to Cristiano Ronaldo: స్టార్ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డోకు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అతన్ని మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ వదిలేసిన వారంలోపే సౌదీ అరేబియా క్లబ్‌ ఆఫర్‌ ఇచ్చింది. మూడేళ్లకుగాను 22.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.1830 కోట్లు) ఇవ్వడానికి సౌదీ అరేబియా క్లబ్‌ అల్ నసర్‌ సిద్ధంగా ఉన్నట్లు సీబీఎస్‌ స్పోర్ట్స్‌ రిపోర్ట్‌ చేసింది. అంటే ఏడాదికి 7.5 కోట్ల డాలర్లు కావడం విశేషం.

ప్రస్తుతం జరుగుతున్న ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత తమ క్లబ్‌తో చేరాల్సిందిగా రొనాల్డోను అల్‌ నసర్‌ కోరినట్లు సమాచారం. రికార్డు స్థాయిలో ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఐదుసార్లు ఆడిన రొనాల్డో.. ఈ వరల్డ్‌కప్‌ ప్రారంభమైన మొదట్లోనే మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ క్లబ్‌పై సంచలన ఆరోపణలు ...