భారతదేశం, మార్చి 26 -- Satysai Crime : శ్రీ‌స‌త్యసాయి జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యార్థినిపై ప్రైవేట్ పాఠ‌శాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. రాత్రుళ్లు త‌న గ‌దికి బాలిక పిలిపించుకుని అస‌భ్యక‌రంగా ప్రవ‌రిస్తూ ఎక్కడ ప‌డితే అక్కడ తాక‌డం వంటి చేష్టల‌కు దిగాడు. కుమార్తె ప‌రీక్షలు ఎలా రాస్తోందో తెలుసుకోవ‌డానికి వెళ్లిన‌ త‌ల్లి వ‌ద్ద బాలిక బోరున విల‌పించింది. బాధిత త‌ల్లి ఫిర్యాదు మేర‌కు ప్రైవేట్ పాఠ‌శాల ప్రిన్సిపల్ పై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న శ్రీ‌స‌త్యసాయి జిల్లా గోరంట్ల మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం గోరంట్లలోని హిందూపురం రోడ్డులో ల‌క్ష్మీప‌తి కొన్నేళ్లుగా ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆ పాఠ‌శాల‌లో అదే మండ‌లానికి చెందిన ప‌దో త‌ర...