Hyderabad, మార్చి 15 -- రోజు మొత్తంలో మీకోసం మీరు ఏం చేస్తున్నారు అంటే సమాధానం మీ దగ్గర ఉందా? మీరే కాదు ఈ ప్రశ్నకు సమాధానం చాలా మంది దగ్గర లేదు. భర్త లేదా భార్య కోసం, పిల్లల కోసం, ఇతర కుటుంబ సభ్యుల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, వృత్తి వ్యాపారాల కోసం ఇలా అన్నింటి కోసం 24గంటలు మీరు పరితపిస్తూనే కాలాన్ని గడిపేస్తుంటారు. కానీ ఇందులో మీకోసం అంటే కేవలం మీ శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మీరు ఏమైనా చేస్తున్నారా? అంటే మౌనంగా ఉండిపోక తప్పదు. ఎందుకంటే ఇలా తమ కోసం తాము సమయం కేటాయించేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.

మీరు కూడా ఇలాంటి వారే అయితే మీకంటూ మీరు ప్రత్యేకంగా కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోతే మీ జీవితంలో మీకు సంతృప్తి లేకుండా పోతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే నమ్మకాన్ని కోల్పోతారు, ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా నీరసంగా, ఉదాసీనంగా ఉంటారు. ఇ...