Hyderabad, ఏప్రిల్ 27 -- Saturday Motivation: ప్రముఖ భారతీయ రచయిత చేతన్ భగత్. ఈయన రాసిన పుస్తకాలు ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈ సంవత్సరం మరో కొత్త పుస్తకంతో ఆయన మన ముందుకు వచ్చారు. '11 రూల్స్ ఫర్ లైఫ్' అనే ఈ పుస్తకం ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో విజయం సాధించడానికి మనిషికి మార్గ నిర్దేశం చేసే ఎన్నో అంశాలు ఉన్నాయి.

తన పుస్తకంలో జీవితంలో విజయం సాధించడానికి బొద్ధింకలా జీవించడం నేర్చుకోవాలని రాశారు చేతన్ భగత్. ఇతర ఏ జీవితో పోల్చుకొని మనిషి జీవించినా కూడా అతను విజయవంతమైన జీవితాన్ని గడపలేకపోవచ్చని, బొద్దింకలా బతకడం నేర్చుకుంటే జీవితాన్ని విజయవంతంగా ముగిస్తాడని అన్నారు.

చార్లెస్ డార్విన్ చెప్పిన ప్రకారం ప్రకృతిలో మనుగడ సాధించేది బలమైన జీవి లేదా అత్యంత తెలివైన జీవి కాదు. పరిస్థితులకు ప్రకృతికి తగ్గట్టు తనను తాను అనుకూలంగా మార్చుకునే జీవి. అద...