Hyderabad, ఏప్రిల్ 5 -- ఇతరులతో మాట్లాడిన ప్రతి ఒక్కసారి అవతలి వైపు నుంచి మర్యాద ఆశిస్తాం. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ, ఇది అన్నివేళలా సమంజసం కాదు. కొన్నిసార్లు జాగ్రత్తకు మించి వ్యవహరించాల్సి ఉంటుంది. వీలైనంత వరకూ ఎదుటివారు ముందు తెలివిగలవారిగా కనిపిస్తేనే ఏ సమస్యా ఉండదు. మీరు కూడా ఏ మాత్రం అవకాశం వదలకుండా ఉండాలంటే, ఈ 7 రూల్స్ తప్పక పాటించండి. ఇక లేటెందుకు అవేంటో చూసేయండి.

ప్రవర్తనలపై జరిపిన చాలా అధ్యయనాల్లో బయటపడిన వాస్తవమేమిటంటే, అవతలి వ్యక్తితో మాట్లాడే సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ అంటే చక్కటి భాష, అభ్యంతరాలు లేనటువంటి భాషను మాత్రమే ఉపయోగించాలట. ఇలా కాకుండా భారీ పదజాలాన్ని వినియోగించాలని ప్రయత్నిస్తే, అది మీ బలహీనతగా మారే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా సాధారణమైనదే అయినా, కాస్త అర్థవంతమైన, వినసొంపైన పదాలను వాడితే సరిపోతుంది....