Hyderabad, మార్చి 22 -- ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించాలంటే, ఎలాంటి కష్టాన్ని అయినా అధిగమించాలంటే నియంత్రణ చాలా ముఖ్యం. ఇక్కడ నియంత్రణ అంటే ఇతరుల మీద చూపించేది కాదు, మీ మీద మీకు నియంత్రణ ఉండాలి. దీన్నే స్వీయ నియంత్రణ అంటారు. ఇందులో ముఖ్యమైనది కష్టతరమైన, ప్రతికూలమైన, అసాధారణ పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండేలా మీ మనస్సును, శరీరాన్ని మలుచుకోవడం. ఎందుకంటే మన ఆలోచనలు, శారీరక కార్యకలాపాలు, మాటల్లో తొందరపాటు కారణంగా ఎక్కువగా తప్పులు జరుగుతాయి.

కొన్నిసార్లు ఈ పొరపాట్లు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి. సంతోషాన్ని దక్కనివ్వకుండా అడ్డుకుంటాయి. మీతో పాటు మీ చుట్టు పక్కల వారినీ, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీ మనస్సుపై మీకు నియంత్రణ ఉండాలి. మీ మనస్సుపై మీకు నియంత్రణ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా శాంతంగా ఉంటే....