భారతదేశం, మార్చి 30 -- Sathyasai Tragedy : శ్రీస‌త్యసాయి జిల్లాలో ఉగాది పండగ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైనైడ్ తీసుకుని బంగారం వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహ‌త్యకు పాల్పడింది. ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మహ‌త్య చేసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా కలకలం సృష్టించింది.

శ్రీ స‌త్యసాయి జిల్లా మ‌డ‌క‌శిర ప‌ట్టణంలోని గాంధీ బ‌జార్‌లో శ‌నివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం మ‌డ‌క‌శిర ప‌ట్టణంలోని గాంధీ బ‌జార్‌లో నివాస‌ముండే బంగారు దుకాణం య‌జ‌మాని కృష్ణమాచారి (55), ఆయ‌న భార్య స‌ర‌ళ‌, కుమారులు సంతోష్‌, భువ‌నేష్ సామూహిక ఆత్మహ‌త్య చేసుకున్నారు. పెద్ద కుమారుడు సంతోష్ ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గా, చిన్న కుమారుడు భువ‌నేష్ ఆరో త‌ర‌గ‌తి చ‌దువుత‌న్నారు. సంతోష్ స్కూల్ టాప‌ర్‌గా ఉన్నా...