భారతదేశం, ఏప్రిల్ 15 -- బాహుబలి మూవీలో కట్టప్ప పాత్ర స‌త్య‌రాజ్‌కు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గుర్తింపును తెచ్చిపెట్టింది. అత‌డి సెకండ్ ఇన్నింగ్స్‌కు బ‌ల‌మైన పునాది వేసింది. బాహుబ‌లి త‌ర్వాత కోలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ స‌త్య‌రాజ్‌ను వ‌రిస్తున్నాయి.

వ‌రుస సినిమాల‌తో యంగ్ హీరోల‌తో ఆఫ‌ర్ల‌లోనే కాదు ప్ర‌మోష‌న్స్‌లో పోటీప‌డుతోన్నాడు. తాను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న త్రిబాణధారి బార్బ‌రిక్ మూవీ కోసం కుర్ర హీరోల స్థాయిలో ప్ర‌మోష‌న్స్ చేస్తోన్నారు.

సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం 'త్రిబాణధారి బార్బరిక్'. డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్‌పాల్ రెడ్డి అడిదాల ఈ సినిమాను నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతోన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్...